![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో శనివారం అనగానే మొదట గుర్తొచ్చే పేరు నాగార్జున. హౌస్ మేట్స్ అందరిని ఒక ఆట ఆడుకుంటాడు. ఒక వైపు సరదాగా గేమ్స్ ఆడిస్తూనే, మరో వైపు ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ సస్పెన్స్ ను కలుగజేస్తాడు.
కాగా శనివారం రోజు వచ్చి రాగానే కెప్టెన్ గా ఇన్న శ్రీహాన్ మీద ఫైర్ అయ్యాడు. "కెప్టెన్ గా నీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకో. నువ్వు కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావ్. వాష్ రూం క్లీన్ చేయమని గీతుకి చెప్పగా, తను ఆదిరెడ్డితో క్లీన్ చేయించింది. అది చూసి నువ్వు గీతుని ఏమన్నావ్? బిగ్ బాస్ నన్నేమయినా అంటే నరికేస్తా నిన్ను అని అన్నావ్. సరే నరికేస్తానన్నావ్ కదా ఇప్పుడు ఏం నరుకుతావో నరుకు. తర్వాత వారం నువ్వు కెప్టెన్ కాకుండా నేను నరుకుతున్నాను" అని నాగార్జున అన్నాడు.
"కెప్టెన్ గా నువ్వు ఎన్నికైన నుండి, హౌస్ లో కొందరికి ఫుడ్ రావడం లేదు. ఆకలితో పడుకుంటున్నారు" అని నాగార్జున, శ్రీహాన్ తో అన్నాడు. ఆ తర్వాత ఇనయాని, "ఫుడ్ సరిపోతుందా" అని నాగార్జున అడిగాడు. తను మాట్లాడుతూ, "ఫుడ్ సరిపోవడం లేదు సర్. బనానా తిని పడుకున్నాను" అని చెప్పగా, "ఇనయా నీకు కావాలసింది క్లారిటిగా అడగాలి" అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీహాన్ వివరించాడు. "కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ సర్. తను ముందు రోజు పాలు తాగుతా అంది. ఆ తర్వాత రోజు టీ పెట్టే ముందు ఫైమా అడిగింది. తను ఏం చెప్పలేదు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ కాఫీ తాగాలని ఉంది అని అడిగింది. ముందే చెబితే టీ కాకుండా పాలు అలా తన కోటా ఉంచేవాళ్ళం సర్" అని శ్రీహాన్ చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, " తర్వాత వారం కాబోయే కెప్టెన్స్ అందరికీ చెబుతున్నా, మీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోండి. కంటెస్టెంట్స్ తప్పు చేస్తే పనిష్మెంట్ సరిగ్గా అమలు చేయండి. పనులను కంటెస్టెంట్స్ చేసేలా చూసుకోండి" అని చెప్పాడు.
![]() |
![]() |